రవితేజ కోసం పవన్ కళ్యాణ్ వస్తున్నాడా?

Tuesday, May 1st, 2018, 05:09:08 PM IST

స్టార్ హీరో పవన్ కళ్యాణ్ ఏదైనా ఆడియో వేడుకలకు వెళుతున్నారంటే ఆ సినిమాకు క్రేజ్ చాలా ఈజీగా పెరుగుతుందని చెప్పవచ్చు. పవన్ ఆడియో వేడుకలకు వెళ్లడం చాలా తక్కువ. ఒకవేళ ఇష్టంతో వెళ్లారంటే సినిమా దాదాపు హిట్ అయినట్టే అనే టాక్ వచ్చేస్తుంది. ఇకపోతే మాస్ రాజా రవితేజ కోసం కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ రాబోతున్నట్లు తెలుస్తోంది. కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వం వహించిన నేల టిక్కెట్టు సినిమాలో రవితేజ సరికొత్త పాత్రలో కనిపించనున్నాడు. మే 24న రిలీజ్ కాబోయే ఆ సినిమా ఆడియో వేడుకను మే 12న నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ వేడుకలో పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా పాల్గొంటారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపోతే దర్శకుడు కళ్యాణ్ కృష్ణ రీసెంట్ ట్వీట్ మరో విధంగా ఉంది. ఇంకా ఆడియో విడుదల తేదీ స్పెషల్ గెస్ట్ విషయంలో అధికారిక నిర్ణయం తీసుకోవాల్సి ఉందని వివరణ ఇచ్చాడు.

Comments