బన్ని సక్సెస్ మీట్ కి స్పెషల్ గెస్ట్ ఎవరో తెలుసా…ఫ్యాన్స్ రెడీ అయిపోండి

Tuesday, May 8th, 2018, 05:24:29 PM IST

నా పేరు సూర్య బాక్సాఫీస్ దగ్గర మిలిటరీ సోల్జర్ గా జువ్వుమని దూసుకుపోతున్న ఈ సినిమా మే 9న అంటే రేపు సాయంత్రం సక్సెస్ మీట్ చేస్కోబోతుంది. అయితే ఈ మధ్య కాలంలో పెద్ద సినిమాల ఆడియో ఫంక్షన్లకు, ప్రీ రిలీజ్, ఇంకా సక్సెస్ మీట్ ఫంక్షన్లకు స్టార్ హీరోలు సినిమాలకు మరింత ప్రోత్సాహాన్ని ఇవ్వడానికి ముఖ్య అతిథులుగా వస్తున్న విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ ఆ మధ్య రామ్ చరణ్ రంగస్థలం సక్సెస్ మీట్ కు ముఖ్య అతిధిగా రావడం ఎంత ప్లస్ అయ్యిందో చూసాం. ఇప్పుడు నా పేరు సూర్యకు కూడా అంతకు మించి ఇంపాక్ట్ ఉంటుందని టీం ధీమాగా ఉంది.

ఇప్పుడు బన్నీ, పవన్ ఈవెంట్ కు రావడం ద్వారా చాలా పొరలు తొలగిపోతాయని చెప్పొచ్చు. ప్రత్యేకంగా పవన్ అల్లు అర్జున్ ఫంక్షన్ కు వచ్చిన దాఖలాలు ఈ మధ్య కాలంలో లేవు. పైపెచ్చు చెప్పను బ్రదర్ ఇష్యూ వల్ల పవన్ ఫాన్స్ బన్నీ మీద అప్పటి నుంచి కొంత గుస్సాగా ఉన్నారనే టాక్ కొంత కాలం నడిచింది కాని ఇప్పుడు అల్లు అర్జున్ సక్సెస్ మీట్ కి పవన్ రావడం వల్ల వాటికి పూర్తిగా చెక్ పడినట్టే. విడుదలకు ముందు మాధవరంలో జరిగిన ప్రీ రిలీజ్ లో బన్నీ పవన్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించడం అందరికీ గుర్తే. ఇప్పుడు పవన్ రాక నా పేరు సూర్యకు మరింత ఊతంగా నిలవనుంది. బన్నీ ఫాన్స్ ప్లస్ పవర్ స్టార్ ఫాన్స్ అటెన్షన్ ని ఒకేసారి లాగేసుకునే ఈ ఈవెంట్ ని చూసేందుకు ఇద్దరు హీరోల ఫాన్స్ పోటీ పడతారు అనడంలో ఎక్కడా సందేహం అక్కర్లేదు.

  •  
  •  
  •  
  •  

Comments