400 ట్విట్టర్ అకౌంట్స్ సస్పెండ్ పై పవన్ కీలక వ్యాఖ్యలు

Wednesday, September 18th, 2019, 01:23:27 PM IST

జనసేన పార్టీకి చెందిన సోషల్ మీడియా అకౌంట్స్ గత కొద్దీ రోజుల నుండి సస్పెండ్ అవుతున్నాయి. తాజాగా ట్విట్టర్ లో జనసేనకి సపోర్ట్ చేసే దాదాపు 400 అకౌంట్స్ ని ట్విట్టర్ సస్పెండ్ చేసింది. నిన్నటి నుండి ఒక్కొక్కటిగా జనసేన కి సపోర్ట్ గా ఉండే అకౌంట్స్ అన్ని సస్పెండ్ అవ్వటం జరుగుతున్నాయి. దీనిపై నిన్నటి నుండి జనసేన అభిమానులు కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా దీనిపై గట్టిగానే విమర్శించాడు. “జనసేన మద్దతుదారుల 400 ట్విట్టర్ ఖాతాలను నిలిపివేయడానికి కారణం నాకు అర్థం కాలేదు. నిస్సహాయ వ్యక్తులు మరియు వారి సమస్యల కోసం నిలబడటమే ఈ ఖాతాలు నిలిపివేయడానికి కారణం అనుకోవాలా ? దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి?” అంటూ #BringBackJSPSocialMedia అనే యాష్ ట్యాగ్ పెట్టి తన అధికారిక ట్విట్టర్ ఖాతా నుండి పోస్ట్ చేశాడు పవన్ కళ్యాణ్

ఇక పవన్ కళ్యాణ్ నుండి ఈ పోస్ట్ రావటంతోనే కొన్ని నిమిషాల వ్యవధిలోనే కొన్ని వేల మంది దానిని రీ ట్విట్లు చేస్తూ ట్విట్టర్ లో హల్ చల్ చేస్తున్నారు. అయితే ట్విట్టర్ ఒక్కసారిగా జనసేనకు చెందిన 400 అకౌంట్లు ఎందుకు సస్పెండ్ చేసింది అనే విషయం గురించి ఇంకా క్లారిటీ రాలేదు. 2019 ఎన్నికల సమయంలో సోషల్ మీడియాలో సపోర్ట్ కోసం జనసేన సోషల్ మీడియా విభాగం పెద్ద ఎత్తున ఇలాంటి అకౌంట్స్ అన్ని క్రియేట్ చేసింది. అయితే వీటిలో కొన్ని జనసేన అభిమానులు సొంతగా చేసినవి కూడా ఉన్నాయి. అవి,ఇవి అనే తేడా లేకుండా జనసేనకి సపోర్ట్ చేసే అకౌంట్స్ అన్ని సస్పెండ్ చేస్తున్నారు.