రాష్ట్ర ప్రభుత్వం పై మరొకసారి సంచలన వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్!

Sunday, May 31st, 2020, 08:26:01 PM IST


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో లాక్ డౌన్ అమలు లో ఉన్న ఇసుక మాఫియా కొనసాగుతుంది అని జన సేన అదినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ మండలికి స్వయం ప్రతిపత్తి కల్పించాలని పవన్ కళ్యాణ్ జన సేన నేతల తో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్ సమావేశంలో వెల్లడించారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఇసుక కోసం ప్రజలు ఇంకా ఇబ్బందులు పడుతున్నారు అని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇసుక సరఫరా ను మరింత సులభ తరం చేయాలని పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సమావేశం ద్వారా కోరారు.

అయితే ప్రస్తుతం ఉన్న ఇసుక విధానం లో చాలా తప్పులు జరుగుతున్నాయి అని అన్నారు. గత టిడిపి ప్రభుత్వం చేసిన తప్పులను ఈ ప్రభుత్వం కూడా చేస్తుంది అని పవన్ కళ్యాణ్ విమర్శించారు. ఈ నేపధ్యంలో ఇసుక మాఫియా ను అదుపు చేయని పక్షం లో నిర్మాణ రంగం కుదేలు అవుతుంది అని సంచలన వ్యాఖ్యలు చేశారు.పెరిగిన ఇసుక ధరల కారణంగా మద్య తరగతి వర్గాల ప్రజలు గృహ నిర్మాణం అంటేనే భయపడుతున్నారు అని సంచలన వ్యాఖ్యలు చేశారు.లాక్ డౌన్ సమయంలో వేలాది లారీలు తిరిగిన డంపింగ్ ప్రాంతానికి చేరుకోలేదు అని వ్యాఖ్యానించారు. ఆ ఇసుక ఎక్కడికి పోయింది అని సూటిగా ప్రశ్నించారు. అంతేకాక పలు కారణాల చేత కార్మికులు పనులు దొరక్క అల్లల్లాడిపో తున్నారు అని అన్నారు.