ఏపీలో మూడో దశ పంచాయితీ ఎన్నికల్లోనూ జనసేన గణనీయ విజయాలు సాధించిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. అయితే పంచాయతీలు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర యాచించడం ఇంకెంత కాలం అని పంచాయితీలను శాసించే స్థాయికి ఎదిగేలా జనసేన కృషి చేస్తుందని ఆయన తెలిపారు. కేంద్రం నుంచే గ్రామాలకు నేరుగా నిధులొస్తున్నాయని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
అయితే మూడో దశ ఎన్నికల్లో జనసేనకు 23శాతం ఓట్లు పోలైయ్యాయని మొత్తం 270 పంచాయతీల్లో జనసేన మద్దతుదారులు గెలుపొందారని, 1,654 మంది అభ్యర్థులు రెండో స్థానంలో నిలిచారని పవన్ స్పష్టం చేశారు. అయితే నాల్గవ దశ పంచాయతీలోనూ జనసేన యువత, ఆడపడుచులు ఇదే స్పూర్తిని కొనసాగించాలని జనసేన కార్యకర్తలు రెట్టింపు ఉత్సాహంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.