కేంద్ర ప్రభుత్వానికి అభినందనలు తెలిపిన పవన్.. ఎందుకంటే..!

Saturday, May 30th, 2020, 05:47:43 PM IST

కేంద్ర ప్రభుత్వానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. దేశ ప్రధానిగా మోదీ రెండో సారి అధికారం చేపట్టి ఏడాది గడిచిపోయింది. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్‌డీఏ2 ప్రభుత్వ పాలన అద్భుతంగా ఉందని అన్నారు.

అయితే ఈ ఏడాది దేశం ఎన్నో చారిత్రాత్మకమైన నిర్ణయాలను చూసిందని ఇక మన భారత్ త్వరలో స్వయం ఆధారిత దేశంగా మారనుందని అన్నారు. మోదీ నేతృత్వంలో ఈ 21వ శతాబ్ధం భారత్‌దే అవుతుందని ట్వీట్ చేశారు. అయితే ఎన్నో సంచలన, విజయవంతమైన నిర్ణయాలు తీసుకున్న మోదీ ప్రభుత్వంలోని అందరికి పవన్ అభినందనలు తెలిపారు.