పవన్ అలా చేస్తే జగన్ కి ఇంక ఇబ్బందులు తప్పవా?

Tuesday, January 14th, 2020, 10:30:09 PM IST

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలతో ఆంధ్ర ప్రదేశ్ లో అశాంతి నెలకొందని, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందనేది ప్రతిపక్షాల వాదన. అయితే అమరావతిని రాజధాని గా తరలించడమే కాకుండా, మూడు రాజధానులు అంటూ చేసిన ప్రతిపాదన తో వైసీపీ నేతలు రాష్ట్ర ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నారని పవన్ ఆరోపించారు. చంద్రబాబు మొదటినుండి జగన్ నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు చేసారు. అయితే ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ ఒక ఆసక్తికర విషయాన్నీ వెల్లడించారు.

రాష్ట్ర రాజధాని విషయం లో కేంద్ర ప్రభుత్వం కలుగచేసుకోవాలని తెలిపిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్నీ పూర్తిగా చర్చించకపోయినప్పటికీ, ఆంధ్ర రాష్ట్ర తెలంగాణ విడిపోయినప్పుడు దానికి బాధ్యత కేంద్రానిదే అని పవన్ వ్యాఖ్యలు చేసారు. రాజధాని విషయం లో అదే వ్యాఖ్యలు చేయడం తో జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ బీజేపీ తో పొత్తు పెట్టుకోవడం తో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు మారనున్నాయి. అయితే ప్రప్రధమంగా ఈ పొత్తు వలన నష్టపోయేది వైసీపీ ప్రభుత్వం అనేది కొందరి రాజకీయ విశ్లేషకుల వాదన, మరి పవన్ ఇక ఫై ఎలాంటి వ్యూహాలు అమలు చేస్తారో తెలియాలంటే వేచి చూడాల్సిందే.