బ‌న్ని వేడుక‌లో గొడ‌వ‌ల‌వుతాయేమో?

Wednesday, May 9th, 2018, 01:46:26 AM IST

మాట‌ల్లేవ్ మాట్లాడుకోడాల్లేవ్‌! చెప్ప‌ను బ్ర‌ద‌ర్!! అంటూ బన్ని చేసిన కామెంట్ల‌ను మెగా ఫ్యాన్స్ ఎంతో సీరియ‌స్‌గా తీసుకున్నారు. అస‌లు మెగా కాంపౌండ్ వేరు.. అల్లు కాంపౌండ్ వేరు.. అంటూ స‌ప‌రేష‌న్ మొదలు పెట్టింది నాటి నుంచే. ప‌వ‌న్‌క‌ల్యాణ్ విష‌యంలో బ‌న్ని వైఖ‌రిని ప‌వ‌ర్‌స్టార్ అభిమానులు తీవ్రంగా వ్య‌తిరేకించారు. అయితే ఆ క్ర‌మంలోనే బ‌న్ని ప‌లు సంద‌ర్భాల్లో వివ‌ర‌ణ ఇచ్చే ప్ర‌య‌త్నం చేసి అల‌సిసొల‌సి పోయాడు. ప‌వ‌ర్‌స్టార్ గురించి చెప్పాల్సి వ‌స్తే, అందుకు స‌రైన సంద‌ర్భం రావాలి.. అందుకో వేదిక కావాలి! అని ఇటీవ‌ల ఎంతో డిగ్నిఫైడ్‌గా ఫ్యాన్స్‌కి క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశాడు. అయితే అస‌లు బ‌న్ని – ప‌వ‌న్ మ‌ధ్య అంత గ్యాప్ ఉందా? అన్న అయోమ‌యం, సందిగ్ధ‌త అభిమానుల్లో నెల‌కొనేందుకు గ‌త వివాదాలు కార‌ణ‌మ‌య్యాయి.

అయితే వీట‌న్నిటికీ ఇప్పుడు తూచ్ కొట్టేసేందుకు ఒక వేదిక రెడీ అవుతోంది. అదే నా పేరు సూర్య ఇండియా థాంక్స్ మీట్‌. ఈ వేడుక‌లో స్పెష‌ల్ గెస్ట్ ఎవ‌రో తెలుసా? ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌. అంటే చెప్ప‌ను బ్ర‌ద‌ర్.. అనేది ఇక లేదు. అంతా చెప్పేస్తాడ‌నే అర్థ‌మ‌వుతోంది. ఇక బ‌న్ని గెస్టుగా ప‌వ‌న్ రావ‌డం వెన‌క .. ఇక మా ఫ్యామిలీ అంతా ఒక్క‌టే! అన్న సిగ్న‌ల్స్ ఇవ్వ‌డ‌మేన‌ని భావించాలి. జ‌న‌సేనాని హోదాలో ప‌వ‌న్ రాజ‌కీయాల్లో ఉండ‌డం, అత‌డికి నైతిక మ‌ద్ద‌తునిస్తూ మెగా, అల్లు కుటుంబాలు ఏక‌మ‌వ్వ‌డం అన్న కొత్త స‌న్నివేశం క‌నిపిస్తోంది. మొత్తానికి ఈ కొత్త ట‌ర్న్ క‌చ్ఛితంగా అది మెగా ప‌వ‌ర్‌ని పెంచేదేన‌ని చెప్పొచ్చు. అయితే రేప‌టి ఈవెంట్ వేళ ప‌వ‌న్ ఫ్యాన్స్‌, బ‌న్ని ఫ్యాన్స్ మ‌ధ్య విభేధాలు ఉండ‌వ‌నే భావిద్దాం.

  •  
  •  
  •  
  •  

Comments