షాకింగ్ : జనసేనాని రివ్యూలో తేలిన భయంకరమైన నిజం ఇదేనట!

Tuesday, June 11th, 2019, 10:00:03 AM IST

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తన ఓటమి అనంతరం కొన్ని రోజులు మౌనం వ్యక్తం చేసి అసలు జనసేన ఓటమిని కారణాలు ఏమిటా అని కొన్ని సమీక్షా సమావేశాలు కూడా ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.గత కొన్ని రోజుల నుంచి పవన్ పలు చోట్ల ఈ సమావేశాలు ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరి నుంచి అసలు పార్టీ ఓటమికి కారణాలు ఏమిటా అని సమీక్షలు నిర్వహించగా పవన్ కు మైండ్ బ్లాక్ అయ్యే నిజాలు బయట పడ్డాయని తెలిసింది.

ఇటీవలే పవన్ నిర్వహించిన ఒక సమీక్షా సమావేశంలో పవన్ ఒక వ్యక్తిపై ఫైర్ అయిన సంగతి తెలిసిందే.అలాగే పవన్ కు కూడా ఒక విస్తుపోయే అసలు మింగుడు పడని అంశం తెలిసిందట.పవన్ అప్పటి వరకు ఓట్లు వేస్తామని చెప్పిన వారిలో చాలా మంది కూడా జనసేనకు ఓట్లు వెయ్యలేదని తెలిసిందట.ఇది తెలిసిన పవన్ అందువల్లే తన సహనం కోల్పోయారని తెలుస్తుంది.తనని కాదని ఎవరు అధికారంలోకి వస్తే దోపిడీలు ఎక్కువయ్యిపోతాయని పవన్ పెద్ద ఎత్తున ప్రచారం చేసారో అదే వైసీపీ పార్టీకి వేసారన్న విషయం తెలిసాక పవన్ కు మరింత ఆగ్రహం వచ్చిందట.ఇందువల్లే పవన్ ఇప్పుడు ఈ స్థాయిలో రగిలిపోతున్నారని విశ్లేషకులు అంటున్నారు.