టార్గెట్ చేసింది ఈ ముగ్గురే .. ఫోటోలు బయటపెట్టిన పవన్ ?

Friday, April 20th, 2018, 03:49:11 PM IST

ఈ మధ్య వరుసగా పవన్ కళ్యాణ్ పై వివాదాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా పవన్ కళ్యాణ్ తల్లిని అసభ్యకరంగా తిట్టిన తిట్లను పదేపదే ప్రసారం చేసి దారుణంగా వ్యవహరించారంటూ టివి 9 ఛానల్ పై పవన్ విరుచుకు పడ్డారు. ఈ సందర్బంగా తెలుగు దేశం పార్టీ పై కూడా పవన్ ఫైర్ అయ్యారు. ప్రస్తుతం జరుగుతున్న దారుణానికి కారణం ఈ ముగ్గురే అంటూ ఓ ఫోటోని పోస్ట్ చేసాడు పవన్. ఈ ముగ్గురు కలిసి తెలుగుదేశం పార్టీ బాసులకు సహకరించారని వారిలో టివి 9 రవిప్రకాష్, శ్రీని రాజు, వర్మ ల ఫోటోలను బయట పెట్టారు. ఈ విషయంలో తాను సహించేది లేదని తన తల్లితో కలిసి దీక్షకు దిగేందుకు సైతం సిద్ధం అయ్యాడు పవన్.

  •  
  •  
  •  
  •  

Comments