అజ్ఞాతవాసికి అది అలవాటే..!

Wednesday, January 10th, 2018, 02:43:11 PM IST

పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాతవాసి చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ చిత్రం పై పవన్ ఫాన్స్ బోలెడు ఆశలు పెట్టుకుని ఉన్నారు. కాగా రాత్రి నుంచి ప్రారంభం అయిన ప్రీమియర్ షో లనుంచి అజ్ఞాతవాసి చిత్ర టాక్ బయటకు వచ్చేసింది. టాక్ తో పవన్ ఫాన్స్ కాస్త గందరగోళానికి గురి అవుతున్నారు. రెండు రోజులు గడచినా తరువాతే ఈ చిత్ర రిజల్ట్ పై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కానీ ప్రస్తుతానికైతే మిక్స్డ్ టాక్ తో ఈ చిత్రం నడుస్తోంది. కాగా పవన్ ఖుషి చిత్రం నుంచి మొదలెట్టుకుంటే.. ఓ కొత్త సెంటిమెంట్ ని సినీ అభిమానులు బయటకు తీస్తున్నారు.

పవన్ కళ్యాణ్ కు ఓ బ్లాక్ బాస్టర్ హిట్ పడితే ఆ తరువాత కనీసం మూడు చిత్రాలు ప్లాపులు పడడం గతంలో కూడా జరిగింది. ఖుషి చిత్రం తరువాత కొన్ని పరాజయాలు ఎదురయ్యాయి. ఆ తరువాత జల్సా చిత్రంతో పవన్ కళ్యాణ్ కలెక్షన్ల ప్రభంజనం సృష్టించాడు. ఆ తరువాత వచ్చిన పులి, పంజా మరియు తీన్ మార్ చిత్రాలు నిరాశ పరిచాయి. ఆ సెంటిమెంట్ మళ్లీ అత్తారింటికి దారేది తరువాత మొదలయిందని సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.