సీఎం జగన్ కి వార్నింగ్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ – ఏమన్నారో తెలుసా…?

Thursday, November 14th, 2019, 11:30:10 PM IST

గురువారం నాడు మంగళగిరిలో జనసేన పార్టీ కార్యాలయంలో తన పార్టీ ప్రతినిధులందరితో కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు జనసేనాని పవన్ కళ్యాణ్. కాగా ఈ సందర్భంగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ అధికార పార్టీ నేతలు కావాలనే రెచ్చగొట్టే వాఖ్యలు చేస్తున్నారని, కానీ వారు ఎంతలా రెచ్చగొట్టినప్పటికీ కూడా మనం అందరం కూడా సహనాన్ని కోల్పోవద్దని, వ్యక్తిగత దూషణలకు పాల్పడవద్దని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన పార్టీ నేతలకు సూచించారు. ఇకపోతే ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ , సీఎం జగన్ కి ఒక వార్నింగ్ కూడా జారీ చేశారు.

“పరిస్థితుల కారణంగా విడిపోయిన వారి జీవితాల్లోకి వెళ్లి, వ్యక్తిగత విషయాలు బయటకు తీసుకువస్తున్న మీ నాయకుడిని పద్ధతి సరిచేసుకోమని చెప్పండి” అంటూ పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపోతే ఇటీవల వైసీపీ నేతలు పవన్ పై చేసిన విమర్శలపై స్పందించిన పవన్… ‘ఇంగ్లీష్‌ రాకపోయినా.. మీ ఆదాయానికి ఇబ్బంది రాలేదు కదా’ అంటూ వైసీపీ నేతలను ఉద్దేశించి పలు వాఖ్యలు చేశారు. అంతేకాకుండా మన తల్లిని, మన మాతృ బాషని గౌరవించని వారు మట్టికొట్టుకుపోతారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సీఎం జగన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.