మమ్మల్ని రెచ్చగొట్టకండి.. వైసీపీ నేతలకు పవన్ స్ట్రాంగ్ వార్నింగ్..!

Tuesday, January 14th, 2020, 07:25:00 PM IST

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడలో వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి వర్గీయుల దాడిలో గాయపడిన జనసైనికులను పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన పవన్ వైసీపీ నేతలకు, పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం కావాలనే గొడవలను సృష్టిస్తుందని అన్నారు. వైసీపీ నేతలు బూతులు తిట్టి, దాడులు చేస్తే, దానిని అడిగినందుకు జనసైనికులపై దాడి చేయడం బాధాకరమని అన్నారు.

అయితే బలం ఉన్న వాళ్లం కాబట్టే భరిస్తున్నామని, మేము తెగించి రోడ్ల మీదకు వస్తే వైసీపీ నేతలెవరు ఉండరని అన్నారు. అయితే పోలీసులకు, వైసీపీ నేతలకు కలిపి చెబుతున్నా ఇంకొక సంఘటన మాపై జరిగితే ఇక చేతులు కట్టుకొని కూర్చోం మేమేంటో చూపిస్తామని హెచ్చరించారు. అయితే తమ కార్యకర్తలపై దాడులు చేసిన వారిపై కేసులు నమోదు చేయాలని, కారకులైన పోలీసులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. వైసీపీ పాలన వస్తే పాలెగాళ్ల రాజ్యం, ఫ్యాక్షన్ రాజ్యం వస్తుందని ఎప్పుడో చెప్పానని బూతులు మాట్లాడే ప్రజా ప్రతినిధులను ఎప్పుడూ చూడలేదని అన్నారు.