‘పవన్ కళ్యాణ్’ ఇకపై సినిమాలు చేయరట..!

Monday, March 7th, 2016, 07:36:09 PM IST


జనసేన అధినేత ‘పవన్ కళ్యాణ్’ ఇకపై సినిమాలు చేయనంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈరోజు బాలీవుడ్ క్రిటిక్ ‘అనుపమ చోప్రా’ చేసిన ఇంటర్వ్యూలో పవన్ ఈ విషయాన్ని తెలిపినట్లు సమాచారం. జనాల సమస్యలపై సినిమాల్లో తన గొంతును వినిపించిన పవన్ ఇకపై పూర్తిస్థాయి రాజకీయాల్లో తన గొంతును వినిపించాలని అనుకుంటున్నట్లు తెలిపారట. అదే విధంగా తాను సినిమాల్లో చాలా విషయాలు తెలిపానని.. కానీ వాటిని నిజ జీవితంలో పూర్తిస్థాయిలో ఆచరించనందుకు భాధపడుతున్నాని అన్నారట.

ఇంకా సినిమాలు వేరు నిజ జీవితం వేరనే విషయాన్ని గుచ్చి చెప్పారట. ఈ విషయాన్ని విన్న పవన్ కళ్యాణ్ అభిమానులు తమ అభిమాన నటుడు త్వరలో సినిమాలు మానేస్తారని ఆందోళనపడుతున్నారు. కానీ పవన్ సినిమాలు వదిలి జనాలకు దగ్గరగా ఉండే రాజకీయాల్లోకి రావాలనుకోవడం మంచి విషయమే. ఇప్పటివరకూ అంటీ అంటనట్లు ఉన్న పవన్ పూర్తిగా రాజకీయాలకు పరిమితమైతే ఏపీ రాజకీయ సమీకరణాలు మారే అవకాశం లేకపోలేదు.