ఆంధ్ర ప్రదేశ్ రాజధాని పై సంచలన వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్

Saturday, August 24th, 2019, 05:23:15 PM IST

గత ప్రభుత్వ పాలనని ప్రస్తుత పాలనతో ముడి పెడుతూ చేసిన వ్యాఖ్యలు పెద్ద ఏటనే దుమారం అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ఉంచాలని తెలియ చేసారు. ప్రభుత్వం మారిన ప్రతి సారి రాజధాని మార్చుకుంటూ పోతూ ఉంటే వ్యవస్థ పై ప్రజలకు నమ్మకం ఉండదు అంటూ వైస్ జగన్ ప్రభుత్వానికి తెలిపారు. గత ప్రభుత్వం అందించిన పాలనని, ప్రస్తుతం వున్న వైయస్ జగన్ ప్రభుత్వం మెరుగు పరిచేలా చర్యలు చేపట్టాలని తెలియ చేసారు. రాష్ట్ర రాజధాని విషయం లో మంత్రులు చేసిన వ్యాఖ్యలు ప్రజలను గందరగోళానికి గురి చేసే విధంగా ఉందని, మంత్రులు ఇలా మాట్లాడితే ఎలా అంటూ, వారి వ్యాఖ్యలను తప్పు పట్టారు.

హైదరాబాద్ లోని జనసేన కార్యాలయంలో రైతు బృందం తమని కలిసి రాజధాని రైతుల పట్ల, రాజధాని పట్ల వారు అనుసరిస్తున్న తీరుని పవన్ దృష్టికి తీసుకు వచ్చారు. రైతుల భాదలు , సమస్యలు అర్ధం చేసుకున్నానని, వారికీ అండగా నిలుస్తానని తెలిపారు. ఈ నెల ఆగష్టు 30, 31 న రాజధాని ప్రాంతంలో పర్యటిస్తానని, మరియు చేపట్టిన పనులు, నిలిచిపోయినటువంటి ప్రాజెక్టులపై పరిశీలన జరుపుతామని వారికీ తెలియ చేసారు. ఈ వరదల వలన ప్రజలు తమ పంటలను, ఇళ్లను కోల్పోయిన సంగతి తెలిసిందే.