మీ టూ వ్యవహారం పై స్పందించిన పవన్ హీరోయిన్ ?

Tuesday, October 23rd, 2018, 03:31:45 PM IST

పవన్ కళ్యాణ్ తో కలిసి ఖుషి సినిమాలో .. నటించిన ముంతాజ్ గుర్తుందా .. అః .. సిద్దు .. సిద్దు అంటూ పవన్ కళ్యాణ్ వెంటపడుతుంది. ఆ తరువాత హాట్ హాట్ పాత్రలతో ఆకట్టుకున్న ఈ అమ్మడు పలు తెలుగు, తమిళ సినిమాల్లో నటించింది. తాజాగా ఈ అమ్మడు మీ టూ వ్యవహారం పై స్పందించింది . నాకు ఇలాంటి లైంగిక వేధింపులు ఉన్నాయంటూ .. ఓ దర్శకుడు షూటింగ్ లో తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని అప్పుడు వెంటనే అతన్ని చెప్పుతో కొట్టానని చెప్పింది. ఈ విషయం పై నడిగర్ సంగంలో కూడా పిర్యాదు చేసానని .. వాళ్ళు ఈ సంఘటనను సాల్వ్ చేసారని పేర్కొంది. ఆ తరువాత అది మనసులో పెట్టుకుని మళ్ళీ నాతొ అలాగే ప్రవర్తిస్తే .. ఈ సారి గట్టిగా వార్ణింగ్ ఇచ్చానని ఆ తరువాత అతగాడు తన జోలికి రాలేదని పేర్కొంది. మీ టూ ఉద్యమంలో కేవలం ఒక్కరి వాదన వినడం సరికాదని చెప్పింది. ఆ మధ్య సినిమాలకు దూరం అయినా ఈ అమ్మడు ఈ మద్యే తమిళ బిగ్ బాస్ 2 తో మళ్ళీ ఫామ్లోకి వచ్చింది.

  •  
  •  
  •  
  •  

Comments