బిగ్ న్యూస్: హోం క్వారంటైన్ లోకి పవన్…అసలు కారణం ఇదే!

Sunday, April 11th, 2021, 02:56:38 PM IST


కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. దేశంలో భారీగా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. అయితే పవన్ కళ్యాణ్ వ్యక్తిగత సిబ్బందిలో కొందరికి కరోనా వైరస్ సోకడం తో పవన్ కళ్యాణ్ హోం క్వారంటైన్ లోకి వెళ్ళారు. సిబ్బంది లో కొంతమందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలడం తో వైద్యుల సూచన మేరకు పవన్ కళ్యాణ్ హోం క్వారంటైన్ కి వెళ్ళారు. అయితే ముందు జాగ్రత్త చర్యగా పవన్ కళ్యాణ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే జన సేన పార్టీ వ్యవహారాల కార్యనిర్వాహకులు, భద్రతా సిబ్బంది, వ్యక్తి గత సిబ్బంది లోని ఎక్కువ మంది కరోనా వైరస్ భారిన పడినట్లు తెలుస్తోంది. అయితే గత కొద్ది రోజులుగా ఆయన సిబ్బంది లో ఒక్కొక్కరూ కరోనా వైరస్ భారిన పడటం గమనార్హం. అయితే రోజువారీ పార్టీ కార్యక్రమాలను పరిశీలిస్తూనే, టెలీ కాన్ఫరెన్స్ ద్వారా పార్టీ నాయకులతో చర్చలు జరపనున్నారు. అయితే ఈ విషయాన్ని జన సేన పార్టీ ఓ ప్రకటన ద్వారా వెల్లడించడం జరిగింది.