చిరంజీవి రాజకీయాల్లో ఉంటే సీఎం అయ్యేవారు – పవన్ కళ్యాణ్

Friday, December 4th, 2020, 03:00:23 AM IST

తిరుపతి కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆశయ బలం ఉన్న వారికి ఓటమి కుంగుబాటును ఇవ్వదని అన్నారు. చిరంజీవి ఇప్పటికీ రాజకీయాల్లో ఉండి ఉంటే సీఎం అయ్యేవారని అన్నారు. అధికారం అనేది మనకు బాధ్యత, అలంకారం కాదని అన్నారు. సిమెంటు ఫ్యాక్టరీ కోసమో, ఇసుక అమ్ముకోవటానికో, మద్యం అమ్ముకోవటానికో నేను సీఎం అవ్వాలనుకోవట్లేదని స్పష్టం చేశారు.

అభిమానులు సెల్ఫీ ఇవ్వకపోతే ఓటు వేయనని నన్ను బెదిరించకండని, నేను మీ కోసం వచ్చానని నన్ను పని చేసుకోనివ్వండని, ఫొటో తీసుకోలేదని నాపైన కోపం చూపించకండని విజ్ఞప్తి చేశారు. అందరూ 25 కేజీలు బియ్యం ఇవ్వాలని చూస్తున్నారని కానీ నేను 25 సంవత్సరాల భవిష్యత్తును ఇవ్వాలని చూస్తున్నానని పవన్ అన్నారు. రైతు విలువ తెలియాలంటే ప్రతి ఒక్కరు ఒక గింజను నాటి మొక్కను సంరక్షించి చూడాలని, రైతుల కోసం, అమరావతి రైతు కోసం లాఠీలు విరివిగా ముందుకు వెళ్లటానికి సిద్ధంగా ఉన్నాను. రైతు కోసం, కౌలు రైతు కోసం జై కిసాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని త్వరలో దీని కార్యాచరణను ప్రకటిస్తామని తెలిపారు. ఇక మిగిలిన రాజకీయ నేతల్లా నాకు సిమెంట్ ఫ్యాక్టరీలు, మీడియా సంస్థలు లేవని అందుకే సినిమాల్లో నటిస్తున్నాను అని పవన్ చెప్పుకొచ్చాడు.