హైకోర్టు తీర్పు ప్రజాస్వామ్యానికి ఊపిరి పోసింది – పవన్ కళ్యాణ్

Friday, May 29th, 2020, 02:52:37 PM IST


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయ స్థానం నేడు సంచలన తీర్పు వెలువరించింది. అయితే జన సేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ హైకోర్టు తీర్పు ను ఉద్దేశిస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈరోజు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తొలగిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్సు ను రద్దు చేస్తూ, ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పు రాష్ట్రం లో ప్రజాస్వామ్యానికి ఊపిరి పోసింది అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. అలానే ప్రజాస్వామ్య ప్రక్రియ పై ప్రజల కి విశ్వాసం ఇనుమడింప జేసింది అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు పవన్.

అయితే పవన్ కళ్యాణ్ గతంలో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను విధులు నుండి తొలగించడం పై పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కక్ష సాధింపు, మొండి వైఖరి, ఏక పక్ష నిర్ణయాల తో జగన్ రెడ్డి గారి ప్రభుత్వం మరొకసారి వ్యవహరించింది అని వ్యాఖ్యానించారు. కరోనా వైరస్ మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతున్న సమయం లో ఎన్నికలు నిర్వహించి ఉంటే ఎన్ని ప్రాణాలు పోయేవో చెప్పగలరా అని అన్నారు. ఇదా సరైన సమయం అంటూ జగన్ ప్రభుత్వం పై నిప్పులు చెరిగారు.

అయితే స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల సమయం లో జన సైనికుల మీద జరిగిన దాడులను గుర్తు చేస్తూ కొందరు నెటిజన్లు వ్యాఖ్యలు చేస్తున్నారు. జన సేన పార్టీ కి చెందిన కొందరు నేతలను నామినేషన్ లు వేయనివ్వలేదు అని, స్థానిక సంస్థల ఎన్నికలు రద్దు చేసి మళ్లీ కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వాలి అంటూ, అందుకు మీరు చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ కి నెటిజన్లు సూచనలు చేస్తున్నారు.