బెల్లంకొండకు పవర్ స్టార్ సాక్ష్యం అవుతాడా ?

Wednesday, May 16th, 2018, 01:02:03 PM IST

సినిమాలు వద్దనుకుని రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వచ్చే ఎన్నికల నేపథ్యంలో జనసేన పార్టీ కార్యక్రమాలపై ఫోకస్ పెట్టాడు. అయితే సినిమాలు మొత్తంగా మానేస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్ .. ఈ మధ్య పలు సినిమా ఈవెంట్స్ లో పాల్గొనడం ఆసక్తి రేపుతోంది. తనకు సంబంధం లేని ఆడియో వేడుకలకు కూడా పవన్ కళ్యాణ్ హాజరయ్యాడు. రంగస్థలం సక్సెస్ సెలెబ్రేషన్స్ లో పాల్గొన్న పవన్ ఆ తరువాత నా పేరు సూర్య, నెల టికెట్ ఆడియో వేడుకకు చీఫ్ గెస్ట్ గా వచ్చాడు.

తాజాగా మరో సినిమా పాటల వేడుకకు గెస్ట్ గా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే .. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా శ్రీ వాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సాక్ష్యం సినిమా పాటల వేడుక త్వరలోనే జరపనున్నారు. ఈ వేడుకకు పవన్ ముఖ్య అథితిగా వస్తాడని వార్తలు వస్తున్నాయి. హైద్రాబాద్ లో జరిగే ఈ వేడుకను పవన్ కు వీలైన డేట్ రోజు పెట్టాలనే దిశగా సన్నాహాలు చేస్తున్నట్టు టాక్. అయన ఓకే అంటే వెంటనే డేట్ తో పాటు ఎక్కడ అన్నది కన్ఫర్మ్ అవుతుంది. మరి పవన్ ఈ వేడుకకు వస్తాడా లేదా అన్న సాక్ష్యం తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.