నైజాం మెగాస్టార్‌కి ముఖ్య అతిధి జ‌న‌సేనాని?

Thursday, March 22nd, 2018, 09:26:20 PM IST

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ .. త‌న వీరాభిమాని కోసం క‌ద‌లి వ‌స్తున్నారు. ఒకే వేదిక‌పై స‌ద‌రు అభిమానితో క‌లిసి త‌న‌ అభిమానుల‌కు అభివాదం చేయ‌బోతున్నారు. ఇంత‌కీ ఎవ‌రా అభిమాని? ఏమా క‌థ అంటే వివ‌రాల్లోకి వెళ్లాల్సిందే.

ఆ అభిమాని ఎవ‌రో మీరు ఊహించ‌లేని అభిమాని కానేకాదు. అత‌డు హీరో నితిన్‌. నైజాం మెగాస్టార్‌గా పాపులారిటీ తెచ్చుకున్న యువ‌హీరో. స్టార్ హీరోల‌కు ఏమాత్రం తీసిపోని ధీటైన ప్ర‌తిభావంతుడు నితిన్. త‌న‌కోసం ప‌వ‌న‌న్న దిగి వ‌స్తున్నాడు. త‌న సినిమా ప్ర‌మోష‌న్ కోసం ప‌వ‌ర్‌స్టార్ స్టేజీని పంచుకోబోతున్నారు. ఇంత‌కీ ఏ సినిమా? అంటారా? అదేనండీ… ఛ‌ల్ మోహ‌న్‌రంగ‌. 2018 స‌మ్మ‌ర్‌లో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా రిలీజ‌వుతున్న సినిమా ఇది. ఈ సినిమా ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల్లో వేడి పెంచేశారు అప్పుడే. నితిన్ హీరోగా కృష్ణ చైత‌న్య ద‌ర్శ‌క‌త్వంలో ప‌వ‌న్‌-త్రివిక్ర‌మ్ నిర్మించిన `ఛ‌ల్ మోహ‌న్‌రంగ‌` ప్రీరిలీజ్ ఈవెంట్‌ని ఈ నెల 25న అత్యంత వైభ‌వంగా నిర్వ‌హించ‌నున్నారు. ఈ వేడుక‌కు ప‌వ‌ర్‌స్టార్‌ ప‌వ‌న్ క‌ల్యాణ్‌ ముఖ్య అతిధి. ప‌వ‌న్‌- నితిన్ ఒకే వేదిక‌పై ఫ్యాన్స్‌ను క‌లుస్తున్నారు. ఆస‌క్తిక‌రంగా ఈ చిత్రానికి త్రివిక్ర‌మ్‌తో క‌లిసి ప‌వ‌న్ పెట్టుబ‌డులు పెట్టిన సంగ‌తి విదిత‌మే.