ఎప్పటికీ మీరంతా నా కుటుంబ సభ్యులే – పవన్ కళ్యాణ్

Sunday, April 18th, 2021, 11:09:53 PM IST

ప్రస్తుతం నా ఆరోగ్యం కుదుట పడుతుంది అని జన సేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన ద్వారా తెలిపారు. వైద్యుల సలహాలు, సూచనలు పాటిస్తున్నట్లు తెలిపారు. వీలైనంత త్వరగా కోలుకుని మీ ముందుకు వస్తా అంటూ చెప్పుకొచ్చారు. అయితే కరోనా వైరస్ భారిన పడినప్పటినుండి తన యోగ క్షేమాలు గురించి ఆందోళన చెందుతూ సంపూర్ణ ఆరోగ్యవంతున్ని కావాలని ప్రతి ఒక్కరూ కూడా కోరుకున్నారు అని అన్నారు. అయితే తాను క్షేమంగా ఉండాలని ఆకాంక్షించిన వారందరికీ కూడా కృతజ్ఞతలు అని అన్నారు. మీ గుండెల్లో నాకు స్థానం ఇచ్చారు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు లాంటి పదాలతో నా భావోద్వేగాన్ని వెల్లడించలేను అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అయితే ఎప్పటికీ మీరంతా కుటుంబ సభ్యులే అంటూ చెప్పుకొచ్చారు. పూర్తి ఆరోగ్యంతో మీ ముందుకు వచ్చి, మీతో పాటే ప్రజల కోసం నిలబడతాను అని అన్నారు. అయితే కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత పై సైతం పవన్ కళ్యాణ్ స్పందించారు.

అయితే అధికారిక లెక్కల ప్రకారం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో 7 వేలు, తెలంగాణ లో 4 వేలకి పైగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి అని అన్నారు. కానీ అంతకు రెట్టింపు కేసులు ఉన్నాయి అని వైద్య వర్గాలు చెబుతున్నాయి అంటూ పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ విపత్కర పరిస్థితులను ఎదుర్కోవడానికి ప్రభుత్వాలు మరింత సన్నద్దతతో వ్యవహరించాలి అని అన్నారు. అయితే ఏపీ లో కరోనా వైరస్ భారిన పడినవారికి అవసరమైన బెడ్స్, అత్యవసర ఔషధాలు, ఆక్సిజన్ అందుబాటులో లేకపోవడం దురదృష్టకరం అంటూ చెప్పుకొచ్చారు. అయితే ప్రభుత్వం చర్యలు ఎలా ఉన్నా ప్రజలు తమ వంతు బాధ్యతగా స్వీయ రక్షణ చర్యలు చేపట్టాలి అని పవన్ కళ్యాణ్ అన్నారు.