కాళ్లతో ట్రెండ్ అవుతున్న కాటమరాయుడు..!

Wednesday, December 28th, 2016, 11:10:22 PM IST

katamarayuda
పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం కాటమరాయుడు. పవన్ చివరి చిత్రం సర్దార్ గబ్బర్ సింగ్ పరాజయం పాలైంది. దీనితో పవన్ అభిమానులు కాటమరాయుడు పై భారీ ఆశలనే పెట్టుకుని ఉన్నారు. ఈ చిత్రానికి సంబందించిన చిత్రీకరణ కొద్దీ భాగం మినహా మొత్తం పూర్తయింది. జనవరి, పిబ్రవరికల్లా మిగిలిన షూటింగ్ ని పూర్తి చేసి మార్చి లో ఉగాది కానుకగా చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

న్యూ ఇయర్ సమీపిస్తుండడం తో చిత్ర బృందం పవన్ అభిమానులను ఉత్సాహ పరిచేందుకు సిద్ధమవుతోంది.కాగా కొద్దీ సేపటి క్రితమే కాటమరాయుడు చిత్రానికి సంభందించిన పవన్ లుక్ ని విడుదల చేశారు. న్యూ ఇయర్ కానుకగా టీజర్ ని కూడా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తెలిపింది. కాగా పవన్ లుక్ లో ముఖాన్ని చూపించలేదు. పవన్ కళ్యాణ్ నడుమువరకే ఉన్న ఈ పోస్టర్ లో పంచె కట్టులో నడచి వెళుతున్నాడు. పోస్టర్ విడుదలైన కొద్దీ సేపటికే సోషల్ మీడియా లో వైరల్ గా మారిపోయింది. మరికొన్ని పోస్టర్ లను కూడా న్యూ ఇయర్ సందర్భంగా విధుల చేయనున్నాడు.

  •  
  •  
  •  
  •  

Comments