ప్రశ్నిస్తే పోలీసుల వేధింపులా – పవన్ కళ్యాణ్

Thursday, May 21st, 2020, 04:52:12 PM IST


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి సమస్య పై తన గళం విప్పుతున్న జన సేన పార్టీ కి సంబందించిన నేత ల పై దాడులను మనం ఇటీవలే చూసాం. అయితే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అక్రమం గా ఇసుక ను తరలిస్తున్న వారి నీ ప్రశ్నించి నందుకు జన సేన పార్టీ కి సంబందించిన లోకేష్ అనే వ్యక్తిని వేదింపులకు గురి చేసినట్లు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. అక్రమాలను ప్రశ్నిస్తే పోలీసులు వేదింపులకు గురి చేస్తారా అంటూ పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

అయితే పోలీసులు ప్రజలకు జవాబుదారీ అని, అది అధికార పక్షానికి కాదు అని పవన్ కళ్యాణ్ తెలిపారు.అయితే అక్రమంగా ఇసుక ను తరలిస్తూ ఉంటే అడ్డుకున్నందుకు పోలీసులు వేదించడం నియంతృత్వాన్ని తలపిస్తోంది అని సంచలన వ్యాఖ్యలు చేశారు. జన సేన పార్టీ కి చెందిన లోకేష్ ను పోలీసులు ఆత్మహత్యకు ప్రేరేపించారు అని వ్యాఖ్యానించారు. వారి పై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు పవన్. అయితే ఇలా ప్రశ్నించిన వారినే వేధించడం చట్ట సమ్మతమా అని పవన్ నిలదీశారు. అయితే పోలీసులు, అధికార పార్టీ నాయకుల వేధింపుల పై ప్రజాస్వామ్య దోరణి లో పోరాడాలి అని పవన్ జన సైనికులకు పిలుపు ఇచ్చారు.