బిగ్ బ్రేకింగ్ : ఇసుక దోపిడీ ఇపుడే ప్రారంభమైంది–పవన్

Monday, November 18th, 2019, 10:53:54 AM IST

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇసుక కొరత పై జరిపిన పోరాటానికి సహకరించిన ప్రజలకు, మీడియాకు, రాజకీయ మిత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. జగన్ ఉద్దేశపూర్వకంగా చేసిన తప్పుని తెలుసుకొని శ్రీ జగన్ రెడ్డి ని చేసినందుకుగాను ధన్యవాదాలు తెలిపారు. అంతేకాకుండా 50 మంది కార్మికుల బలిదానం, మరియు 35 లక్షల ఉపాధి కోల్పోవడం వంటి విషయాలను జనసేన అధినేత పవన్ తెలియజేశారు.

అంతే కాకుండా ఇసుక దోపిడీ ఇపుడే ప్రారంభం అయిందని పవన్ అన్నారు. జనసైనికులందరూ ఇసుక అక్రమ తవ్వకాల పై నిఘా ఉంచాల్సిందిగా కోరారు. అయితే ఇదే విషయం సంచలనం గా మారింది. నిన్నటి వరకు ఇంగ్లీష్ మీడియం పై జరిగిన పోరాటం, పవన్ ట్వీట్ చేయడం తో ఇసుక పై కి మారింది.పవన్ పై ఇప్పటికే వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. వ్యక్తిగతంగా విమర్శలు చేయడానికి కూడా వెనకడుగు వేయడం లేదు. మరి ఇపుడు పవన్ చేసిన ట్వీట్ తో వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.