గోదావరి జిల్లాల విషయంలో జనసేనాని సంచలన నిర్ణయం.?

Wednesday, June 5th, 2019, 01:01:59 PM IST

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తన ఓటమి తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారా అన్న అనుమానం ఇప్పుడు మొత్తం జనసేన శ్రేణుల్లో మిగిలి ఉంది.ఫలితాల అనంతరం పవన్ తాను రాజకీయాలను వీడే ప్రసక్తి లేదని రానున్న పాతికేళ్ళు రాజకీయాల్లోనే ఉంటానని పవన్ తెలిపారు.కానీ మళ్ళీ పెద్దగా పార్టీ పనుల్లో నిమగ్నం అయినట్టు కనిపించలేదు.పార్టీ శ్రేణులు కూడా పండుగ శుభాకాంక్షలు ఇతరాత్ర చిన్న చిన్న అప్డేట్స్ చెప్తున్నారు తప్ప పవన్ తీసుకోబోయే తర్వాతి స్టెప్ ఏమిటి అన్నది ఎవరికీ అంతు చిక్కడం లేదు కానీ ఈసారి మాత్రం పవన్ పక్కా ప్రణాళికతో ముందుకు రాబోతున్నట్టు సమాచారం.

అయితే గడిచిన ఎన్నికల్లో నిజంగా పవన్ కానీ ఆ పార్టీ శ్రేణులు కానీ కేవలం ఒక్క సీటుతోనే సరిపెట్టుకుంటారని కలలో కూడా అనుకోని ఉండరు.అలాగే పవన్ కు అత్యధికంగా విశాఖ మరియు గోదావరి జిల్లాల నుంచి అధిక స్థానాలు వస్తాయని అంతా భావించారు.కానీ అక్కడ మాత్రం వారు అనుకున్న విధమైన ఫలితాలు రాలేదు.ముఖ్యంగా అత్యధిక అసెంబ్లీ స్థానాలు ఉన్నటువంటి రెండు గోదావరి జిల్లాల విషయంలో అయితే పవన్ కు తిరుగు లేదని అంతా భావించారు కానీ అక్కడే వారికి గట్టి దెబ్బ తగిలేసరికి ఈసారి ఈ రెండు జిల్లాల విషయంలో పవన్ సంచలన నిర్ణయం తీసుకోనున్నారు అని తెలుస్తుంది.

అక్కడ అసలు వారు ఓటమి పాలివ్వడానికి గల ప్రధాన కారణాలు ఏమిటి? అక్కడ పార్టీ మరీ అంత బలహీనంగా ఉందా? ఒకవేళ ఉన్నట్టయితే మరింత బలోపేతం చేసేందుకు ఏం చెయ్యాలి.ఇలా అనేక రకాల అంశాల మీద పవన్ పార్టీ శ్రేణులతోను అలాగే ఆ రెండు జిల్లాలకు సంబంధించిన కీలక నేతలతోనూ సమగ్ర చర్చలు నిర్వహించేందుకు పూనుకున్నట్టు సమాచారం.ఈసారి వచ్చే ఎన్నికల్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ గోదావరి జిల్లాలలో అనుకున్నది సాధించి ప్రజా సమస్యలపై అసెంబ్లీలో వారి గొంతును మరింత ఎక్కువ వినిపించేలా చెయ్యాలని వారు భావిస్తున్నారని మరికొంత మంది జనసేన శ్రేణులు చెప్తున్నా మాట.మరి పవన్ ఈ సారి ఎలాంటి ప్రభావాన్ని చూపుతారో చూడాలి.