వైసీపీ నేతలకు దిమ్మతిరిగే ప్రశ్న వేసిన పవన్ కళ్యాణ్..!

Thursday, December 12th, 2019, 10:23:36 PM IST

ఏపీలో రైతులకు అండగా, రైతు సమస్యలపై పోరాటం చేస్తూ నేడు కాకినాడలో రైతు సమన్వయ దీక్ష చేపట్టారు. అయితే ఈ సభలో వైసీపీ ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ నిప్పులు చెరిగారు. తాను సూట్‌కేస్ కంపెనీలు పెట్టలేదని, కాంట్రాక్టులు లేవని సినిమాలే తమ ప్రపంచమని అన్నారు.

అయితే రైతులు సభకు వచ్చింది తనతో ఫోటోలు దిగడానికి కాదని, కడుపు మండి సమన్వయ దీక్షకు తరలివచ్చారని అన్నారు. రాష్ట్రంలో రైతులు, భవన నిర్మాణ కార్మికులు అంతమంది చనిపోయినా కనీసం అసెంబ్లీ ప్రారంభానికి ముందు వారికి నివాళులు అర్పించాలన్న జ్ఞానం కూడా వైసీపీ నేతలకు లేదా అని ప్రశ్నించారు. అసెంబ్లీలో బోటు ప్రమాదంలో మరణించిన వారికి కూడా నివాళులు అర్పించలేదని మండిపడ్డారు. అసెంబ్లీలో ప్రజా సమస్యల గురుంచి కాకుండా వ్యక్తిగత ఆరోపణలకే సమయం వృధా చేస్తున్నారని మండిపడ్డారు.