పవన్ సినిమా కోసం కేరళ అభిమానుల ఎదురుచూపులు

Friday, December 1st, 2017, 11:14:56 AM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 25వ సినిమా కోసం ప్రస్తుతం ఆయన అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన అజ్ఞాతవాసిని భారీ స్థాయిలో రిలీజ్ చేయడానికి నిర్మాత ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఈ సారి ఓవర్సీస్ లో కూడా సినిమాపై అంచనాలు చాలానే ఉన్నాయి. ఇకపోతే ఇండియాలో కూడా ఇతర రాష్ట్రాల్లో అజ్ఞాతవాసి రిలీజ్ కాబోతోంది.

ముఖ్యంగా కేరళలో పవన్ కి మంచి క్రేజ్ ఉండడంతో చిత్ర యూనిట్ అక్కడ అమలయాళంలో రిలీజ్ చేయాలనీ చూస్తోంది. ఒకవేళ కుదరకపోతే తెలుగులోనే డైరెక్ట్ గా భారీగా రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. కేరళ సినీ అభిమానులు ఈ సినిమా కోసం చాలా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ క్రేజ్ తో పాటు అనిరుద్ సినిమాకు సంగీతం అందిస్తుండడం మరో ప్లస్ పాయింట్. అలాగే మలయాళీ ముద్దుగుమ్మలు అను ఇమ్మాన్యుయేల్ – కీర్తి సురేష్ హీరోయిన్స్ గా ఉండడంతో అక్కడి అభిమానులు చాలా ఆసక్తిని చూపిస్తున్నారు. మరి ఈ క్రేజ్ తో సినిమా ఎంతవరకు అక్కడ విజయం సాధిస్తుందో చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments