భారీ బడ్జెట్ సినిమాలో పవర్ స్టార్ ?

Monday, October 8th, 2018, 01:43:18 PM IST

ఏంటి పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమా చేయనున్నాడా ? అన్న సందేహం కలుగుతుందా … ? అవును మీరు విన్నది నిజమే. అజ్ఞాతవాసి ప్లాప్ తరువాత పవన్ కళ్యాణ్ వెంటనే రాజకీయాల్లోకి దిగిపోయాడు. అప్పటినుండి అయన పార్టీ ప్రచార కార్యక్రమాల్లోనే ఉంటున్నాడు. అయితే సినిమాలు మొత్తం మానేస్తానని పవన్ ఎప్పువు చెప్పలేదు .. అటు రాజకీయాలు , ఇటు సినిమాలు రెండు చూసుకుంటానని చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ పవన్ ప్రచారం విషయంలో ఇంకా బిజీ అయ్యాడు. అయితే పవన్ కళ్యాణ్ ఓ భారీ బడ్జెట్ సినిమాలో నటించేందుకు ఓకే చెప్పిట్టు వార్తలు వస్తున్నాయి ? అవును అయితే ఈ న్యూస్ తెలిపింది ఎవరో కాదు దుబాయ్ లో ఇండియన్ సినిమాలకు సెన్సార్ చేసే అధికారి ఉమైర్ సింధు అనే వ్యక్తి ట్విట్టర్ లో ఈ న్యూస్ పోస్ట్ చేసాడు. అయితే ఈ సీనిమా 2019 ఎన్నికల తరువాత ఉంటుందని తెలిపాడు. దాంతో ఆయాన ఫాన్స్ ఓ వైపు ఖుషి అవుతున్నారు .. కానీ మరోవైపు పవన్ పూర్తిగా రాజకీయాల్లోకి వస్తానని అన్నాడు … ఈ న్యూస్ ఎలా ? అంటూ షాక్ అవుతున్నారు మరి కొందరు. ఇక ఉమర్ పెట్టిన న్యూస్ పై రకరకాలుగా స్పందిస్తున్నారు నెటిజన్స్. మరి ఇందులో నిజం ఏమిటన్నది తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.