పవన్ అదే తప్పు మళ్ళీ చేస్తున్నాడా ?

Saturday, October 14th, 2017, 11:40:37 PM IST


పవర్ స్టార్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటిస్తున్న అజ్ఞాతవాసి దాదాపు పూర్తీ కావొచ్చింది. ప్రస్తుతం సాంగ్స్ కోసం విదేశాలకు వెళ్ళింది యూనిట్. వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల కానున్న ఈ సినిమా తరువాత పవన్ మరో సినిమాకు ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల నేపథ్యంలో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నపవన్ ఈ లోగా వీలైనన్ని ఎక్కువ సినిమాలు చేయాలనీ ప్లాన్ చేస్తున్నాడు. తాజాగా కందిరీగ దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ కు ఓకే చెప్పినట్టు తెలుస్తోంది? ఓ పోలీస్ కథ చెప్పాడట శ్రీనివాస్ .. ఆ కథ నచ్చడంతో పవన్ చేసేందుకు సిద్ధం అయ్యాడని టాక్, కానీ దానికంటే బెటర్ గా తమిళ సూపర్ హిట్ సినిమాను రీమేక్ చేద్దామని ఆ సినిమా గురించి ప్లాన్ చేయమని పవన్ చెప్పడంతో సంతోష్ శ్రీనివాస్ ఆ పనుల్లో ఉన్నాడట. పవన్ కు రీమేక్ సినిమాలు పెద్దగా వర్కవుట్ అయినా సందర్భాలు తక్కువ .. మళ్ళీ తమిళంలో హిట్ అయిన రీమేక్ సినిమాపై ఎందుకు ఆసక్తి చుపిస్తున్నాడన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇదివరకే కాటమరాయుడు విషయంలో తొందరపడ్డ పవన్ మరోసారి .. అదే తప్పు చేస్తున్నాడా అన్నది మెగా అభిమానులను టెన్షన్ పడుతున్నారు. ఇప్పటికే జనసేన విషయంలో బిజీగా ఉన్న పవన్ ఇలా రీమేక్ సినిమాలో నటించడం ఎందుకో మరి.