పవన్ నెక్స్ట్ ఎవరితో ?

Saturday, January 20th, 2018, 02:22:46 PM IST

అజ్ఞాతవాసి సినిమాతో ఎవరు ఊహించని విధంగా డిజాస్టర్ అందుకున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నాడు అని సినీ ఇండస్ట్రీలో గుసగుసలు మొదలయ్యాయి. ఆయన నెక్స్ట్ ఎవరితో సినిమా చేస్తాడు అనే ప్రశ్న కూడా బాగా వినిపిస్తోంది. అయితే అజ్ఞాతవాసి తరువాత ఏఎమ్.రత్నం ప్రొడక్షన్ లో ఒక సినిమాను చేస్తాడని మీడియాల్లో కథనాలు వెలువడ్డాయి. అంతే కాకుండా పవన్ కు ముందుగానే నిర్మాత రూ.5కోట్ల వరకు అడ్వాన్స్ కూడా ఇచ్చారని రూమర్స్ వచ్చాయి. ఇది ఎంతవరకు నిజమో తెలియదు గాని రత్నం మాత్రం పవన్ తో సినిమా తప్పకుండా ఉంటుందని గతంలో జరిగిన మీడియా సమావేశంలో తెలిపాడు. అయితే ఇంతలో మైత్రి మూవీ మేకర్స్ వారు పవన్ తో ఒక సినిమా చేయనున్నట్లు తెలిసింది. మొదట దర్శకుడిగా సంతోష్ శ్రీనివాస్ ను అనుకున్నా ఆ తరువాత త్రివిక్రమ్ అయితే బెటర్ అని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే త్రివిక్రమ్ పవన్ కి మంచి హిట్ ఇవ్వాలని అనుకుంటున్నాడట. మరి పవన్ ఇప్పుడు ఎవరి ప్రొడక్షన్ లో సినిమాను చేస్తారనేది హాట్ టాపిక్ అయ్యింది. ఇక ఈ విషయంలో ఒక క్లారిటీ రావాలంటే పవన్ నుంచే అధికారిక ప్రకటన రావాలి.