పవన్ కళ్యాణ్ కి ఘోర అవమానం జరిగిందా..?

Saturday, August 17th, 2019, 08:06:09 AM IST

జనసేన పార్టీ అధినేత గత ఐదారేళ్లుగా పాటిస్తున్న సంప్రదాయాన్ని ఈ ఏడాది కొనసాగించలేదు. అదేమిటంటే ప్రతి ఏడాది ఆగస్టు 15 అట్ హోమ్ అనే కార్యక్రమం గవర్నర్ ఆధ్వర్యంలో రాజ్ భవన్ లో జరుగుతుంది. దానికి రాష్ట్రంలోని వివిధ పార్టీ అధినేతలు , కీలకమైన నేతలు హాజరవుతారు. ఈ ఏడాది కూడా ఆంధ్రప్రదేశ్ లో అట్ హోమ్ కార్యక్రమం జరిగింది. కొత్త గవర్నర్ బిస్వాభూషణ్ హరిచందన్ తేనీటి విందు ఏర్పాటు చేశాడు. దీనికి జగన్ మోహన్ రెడ్డి, మంత్రులు, సిపిఐ,సిపిఎం నేతలు ఇలా చాలా మంది హాజరయ్యారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఎక్కడ కనిపించలేదు.

ప్రతి ఏడాది పవన్ కళ్యాణ్ తప్పకుండా అట్ హోమ్ కార్యక్రమానికి వచ్చేవాడు. ఈ ఏడాది రాకపోవటానికి కారణం ఏమిటో తెలియటం లేదు. ఒక వేళ దీనికి ఆహ్వానం అందలేదా..? ఒక పార్టీ అధినేత హోదాలో పవన్ కళ్యాణ్ కి తప్పకుండా పిలుపు వెళ్తుంది. అందులో ఎలాంటి సందేహం అవసరం లేదు. అయినా కానీ పవన్ కళ్యాణ్ మాత్రం పోకపోవటం విచిత్రంగా ఉంది. గతంలో నరసింహన్, చంద్రబాబు జోడి ఉన్నప్పుడు పవన్ తప్పకుండా వెళ్ళేవాడు. బహుశా వాళ్ళు మారిన తర్వాత పవన్ కి వెళ్లాలనిపించలేదేమో..!