శ్రీకాకుళంపై ఉన్న ప్రేమను మరోసారి బయటపెట్టిన జనసేనాని!

Sunday, June 9th, 2019, 08:25:34 PM IST

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికల్లో ఘోరమైన పరాజయం పాలైన సగంతి అందరికీ తెలిసిందే.పవన్ కళ్యాణ్ పోటీ చేసిన గాజువాక మరియు భీమవరం నియోజకవర్గాల్లో కూడా ఓటమి పాలైనందుకు కూడా పవన్ అభిమానులు మరియు ఆ పార్టీ శ్రేణులు ఎంత బాధ పడ్డారో కానీ శ్రీకాకుళంలో వారి పార్టీకి ఇచ్చిన ఫలితాలను చూసి ఒక రకమైన ఆక్రోశకర ఆవేదనను వారు ఫలితాలు వెలువడిన రోజున సోషల్ మీడియాలో వెళ్లగక్కుకున్నారు.శ్రీకాకుళంలో ఎక్కడో ఉన్న ఉద్దానం కిడ్నీ సమస్యను వెలికి తీసి ప్రపంచ దృష్టికి తీసుకొచ్చిన వ్యక్తి ఎవరన్నా మన రాష్ట్ర రాజకీయాల్లో ఉన్నారు అంటే అది ఖచ్చితంగా పవన్ కళ్యాణే అని చెప్పాలి.

ఇతర పార్టీల వారు ఎన్ని అనుకున్నా సరే ఇదే అక్షర సత్యం,ఆ సమయంలో పవన్ దగ్గర ఎలాంటి అధికారం కూడా లేకపోయినా సరే విదేశీ వైద్యులను కూడా తీసుకొచ్చి వారికి తన వంతు సహాయ సహకారాలు అందించాలని చూసారు.అక్కడ వలసలు ఆగాలని తాను అధికారంలోకి వస్తే అక్కడ వలసలను ఆపి తీరుతానని ఎన్నో సార్లు కూడా చెప్పారు.ఇదొక్కటే కాకుండా తిత్లీ తుఫాను సమయంలో అయితే కటిక చీకట్లో కూడా అక్కడ ప్రజలతో గడిపి వారి సమస్యలను తెలుసుకొని ఎన్నో రోజులు వారితోనే గడిపి తిరిగి వచ్చాక కూడా అక్కడి ప్రజలకు మరియు బడికి వెళ్లే పిల్లలకు తన వంతు సహాయ సహకారాలు అందించారు.

అన్ని చేసినా అక్కడ జనసేనకు ఒక్క సీటును కూడా శ్రీకాకుళం ప్రజలు అందించలేకపోయారని పవన్ అభిమానులు తమ ఆవేదనను వెళ్లగక్కుకున్నారు.అయినా సరే పవన్ కు శ్రీకాకుళం పై ఉన్న ప్రేమ ఎక్కడా తగ్గలేదని మళ్ళీ ఈ రోజు నిరూపించుకున్నారు.ఈ రోజు జరిగినటువంటి ఒక మీటింగులో తాను ఇక నుంచి అసలు రాజకీయం మొదలు పెడితే ఎలా ఉంటుందో చూస్తారని తాను కోరుకున్న మార్పు తీసుకొచ్చేంత వరకు శ్రీకాకుళంలోని వలసలు ఆగేంత వరకు తాను రాజకీయాల్లో కృషి చేస్తానని శ్రీకాకుళంపై ఉన్న ప్రేమను మరోసారి పవన్ బయటపెట్టారు.