వైరల్ అవుతున్న పవన్ ఫోటోలు.. కాలర్ ఎగరేస్తున్న అభిమానులు..!

Friday, December 13th, 2019, 12:57:52 AM IST

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎంత సింప్లిసిటీగా ఉంటారో పెద్దగా మనం చెప్పనక్కర్లేదు. ఒక పార్టీ అధినేత, స్టార్ హీరో అయినప్పటికి కూడా ఆయన పెద్దగా హుందాతనాన్ని ప్రదర్శించరు. పవన్ గురుంచి ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన వ్యక్తిత్వం రిచ్‌గా కనిపిస్తుంది కానీ, ఆయన నడవడిక మాత్రం సాదాసీదాగానే ఉంటుంది.

అయితే నేడు పవన్ కళ్యాణ్ చేసిన పనికి అభిమానులు మరో సారి కాలర్ ఎగరేస్తున్నారు. కాకినాడలో రైతు సౌభాగ్య దీక్ష ముగిసిన తరవాత పవన్ రాజమండ్రిలోని మధురపూడి విమానాశ్రయానికి బయలుదేరారు. విమానం ఆలస్యం అని సమాచారం రావడంతో మధ్యలో ఓ జనసేన కార్యకర్త ఇంటి దగ్గర కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నారు. తల కింద కేవలం దిండు మాత్రమే పెట్టుకుని అరుగుపై భయటనే పడుకున్నాడు. అయితే ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి.