శూలంతో కసరత్తులు చేస్తున్న పవన్… హరిహర వీరమల్లు లో అవే కీలకం!?

Friday, April 2nd, 2021, 03:29:27 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం హరిహర వీరమల్లు. ఈ చిత్రం లో పవన్ దొంగ గా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇటీవల టైటిల్ తో పాటుగా విడుదల అయిన టీజర్ తో సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో స్టంట్స్ సైతం కీలకం కానున్నాయి. యాక్షన్ సన్నివేశాలకి కొదవే లేదు అన్నట్లు టీజర్ చూస్తేనే తెలుస్తుంది. అయితే ఈ చిత్రం కోసం పవన్ కళ్యాణ్ చాలానే కష్టపడుతున్నారు. శూలం తో కసరత్తులు చేస్తున్న పవన్ కళ్యాణ్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. శూలం తో ట్రైనర్ తో పాటుగా దర్శకుడు క్రిష్ పర్యవేక్షణ లో పవన్ కసరత్తులు చేస్తూ ఆకట్టుకుంటున్నారు.

పవన్ కళ్యాణ్ కరాటే లో ప్రావీణ్యం ఉందన్న సంగతి తెలిసిందే. క్రిష్ పవన్ కళ్యాణ్ ను పూర్తి స్థాయిలో ప్రజెంట్ చేయనున్నట్లు ఈ స్టిల్స్ చూస్తేనే తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ దీనితో పాటుగా అయ్యప్పన్ కోషియమ్ రీమేక్ లో రానా తో కలిసి నటిస్తున్నారు. ఈ సినిమా పై సైతం భారీ అంచనాలు నెలకొన్నాయి. హరిహర వీరమల్లు ను ఎఎం నిర్మిస్తుండగా, క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా లో నిధి అగర్వాల్ మరియు జాక్వెలిన్ ఫెర్నాండెజ్ లీడ్ రోల్స్ నటిస్తున్నారు.