హాట్ టాపిక్: పవన్ ఫోటోలపై రచ్చ… దీనిని కూడా వివాదం చేస్తారా?

Monday, October 14th, 2019, 10:25:47 AM IST

పవన్ కళ్యాణ్ జి. డి. అగర్వాల్ ప్రధమ వర్థంతికి హరిద్వార్ వెళ్లిన విషయం అందరికి తెలిసిందే. అక్కడి ఆశ్రమంలో ఒక చిన్న గదిలో పవన్ ఉంటున్నాడు. అయితే ఆశ్రమ జీవితానికి సంబందించిన పవన్ వ్యక్తిగత ఫోటోలు బయటికి రావడం పట్ల నెటిజెన్ల , జనసైనికులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మా నాయకుడి నిరాడంబరత, సింప్లిసిటీ, అని అభిమానులు విపరీతంగా పవన్ ఫోటోలను సోషల్ మీడియా లో షేర్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ అభిమాన గణం చేస్తున్న రచ్చ చూసాక నెటిజన్లు, పవన్ వ్యతిరేక వాదులు దారుణంగా స్పందిస్తున్నారు.

పవన్ కళ్యాణ్ ఆశ్రమ జీవితం అనేది తన వ్యక్తిగతం, రాజకీయాల్లో ఓటమి తరువాత పవన్ సమస్యల పైన స్పందిస్తుంటే వైసీపీ నేతలు విమర్శలు గుప్పించిన సంగతి అందరికి తెలిసిందే. పవన్ ఆశ్రమ జీవితం గడుపుతున్నారు కాబట్టే సింపుల్ గా వున్నారు. ఆశ్రమం లో ఇలా కాకుండా ఇంకెలా వుంటారు? అయినా ఫోటోలను బయటికి వదిలి ఫ్రీ పబ్లిసిటీ పొందాలని పవన్ భావిస్తున్నారు అంటూ మరికొందరు అంటున్నారు. పవన్ సినిమాల్లో వున్నా, రాజకీయాల్లో వున్నా, ఇలా వ్యక్తిగతమైన ఎంత ఫాలోయింగ్ ఉందొ, అదే విధంగా విమర్శలు కూడా రావడం ఈ మధ్య సహజం అయిపోయింది.