పవన్ కళ్యాణ్ సూపర్ ప్లానింగ్

Tuesday, January 24th, 2017, 02:26:46 PM IST

pawan
పవన్ కళ్యాణ్ ఓపెనింగ్ సినిమా స్టామినా ని చూపించింది సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా. సింపుల్ గా ఒక ఉదాహరణ లాగా మిడ్ నైట్ షో కే డిజాస్టర్ టాక్ వచ్చినా కూడా ఈ సినిమా యాభై రెండు కోట్లు వసూలు చేసి టాలీవుడ్ చరిత్ర లో పవన్ కళ్యాణ్ కి మాత్రమే సాధ్యమయ్యే ఫీట్ ని సాధించింది. ఇంత తెచ్చినా సర్దార్ ఇచ్చిన నష్టాలు కూడా భారీగానే ఉన్నాయి. బయ్యర్స్ కు నష్టాలను కవర్ చేసేందుకు గాను.. పవన్ వేసిన ఓ సూపర్ ప్లాన్ ఇండస్ట్రీ జనాలను ఆకట్టుకుంటోంది.పవన్ పేరు చెబితే ఓ సినిమాకి టోటల్ గా 80 కోట్ల బిజినెస్ జరిగిపోతుంది. అందుకే భారీ బడ్జెట్ తో నిర్మాణం జరుగుతుంది. కానీ కాటమరాయుడు విషయంలో మాత్రం బడ్జెట్ విషయంలో పరిమితులు పెట్టాడట పవన్. ఇందుకోసం ప్రతీ విషయంలోనూ నియంత్రణలు ఉన్నాయట. పవన్ సినిమా అంటే.. దేవిశ్రీ ప్రసాద్.. థమన్ లాంటి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లను తెచ్చుకోవచ్చు. కానీ.. బడ్జెట్ కండిషన్స్ కారణంగానే అనూప్ రూబెన్స్ ను తెచ్చారని తెలుస్తోంది.అలాగే క్యాస్టింగ్ విషయంలో కూడా బడ్జెట్ కంట్రోల్ బాగానే చేశారట. మొదట పవన్ తమ్ముళ్లుగా నటించేందుకు రాజ్ తరుణ్.. విజయ్ దేవరకొండ వంటి క్రేజ్ ఉన్న కుర్రాళ్లను ఎంపిక చేసుకున్నాడట దర్శకుడు డాలీ. కానీ ఆయా ప్రధాన పాత్రల్లో శివ బాలాజీ.. కమల్ కామరాజు పవన్ కి తమ్ముళ్లుగా కనిపించనున్నారు. ఇదంతా సర్దార్ బయ్యర్స్ కు నష్టాలను కవర్ చేసేందుకే కావడం విశేషం. ఓ సినిమా ఫ్లాప్ తర్వాత.. దాని నష్టాలను భర్తీ చేసేందుకు ఇలాంటివి చాలానే చెబుతారు స్టార్లు. కానీ మాటపై నిలబడ్డ దాఖలాలు తక్కువగా ఉంటాయి. కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం.. మాటపై ఇలాంటి కమిట్మెంట్ చూపించడాన్ని అందరినీ ఆకర్షిస్తోంది.