బ్రేకింగ్ న్యూస్ : జగన్ కు అదిరిరేలా పాయింట్ సూచించిన జనసేనాని.!

Sunday, November 17th, 2019, 04:13:32 PM IST

అసలు ఏపీ రాజకీయాల్లో గడిచిన ఎన్నికల్లో వోటింగ్ పరంగా ఏమాత్రం సత్తా చూపలేదు,అతనికి ఏమీ తెలీదు మాట్లాడ్డం చాతకాదు అని అన్న వారితోనే పదుల సంఖ్యలో ప్రెస్ మీట్లు పెట్టేలా చేసారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్.అయితే గత కొన్ని రోజుల నుంచి పవన్ వర్సెస్ వైసీపీ రాజకీయాలు నడుస్తున్న సంగతి అందరికి తెలిసిందే.పవన్ ఏ చిన్న మాట అన్నా కానీ ప్రశ్నించినా కానీ ఎందుకో వైసీపీ నేతలు ఇష్టపడడం లేదు.

పైగా సరైన సమాధానం కూడా ఇవ్వకపోగా వ్యక్తిగత వ్యవహారాలకు వెళ్లే సరికి ఈ రెండు పార్టీల మధ్య రాజకీయ గొడవలు తారా స్థాయికి వెళ్తున్నాయి.అయితే పవన్ ఏ పాయింట్ ను లేవనెత్తినా దాన్ని చంద్రబాబుకు ఆపాదించి పవన్ మరియు బాబు ఒక్కటే అన్న కోణాన్ని ప్రజలలో ఇంకా రుద్దే ప్రయత్నం చేస్తున్నారు వైసీపీ నేతలు.మొదట నుంచి కూడా పవన్ చెప్తుంది ఒకటే ఎవరి మీదో కోపాన్ని ప్రజల మీద చూపించొద్దు అని.

వైసీపీకి చిరకాల ప్రత్యర్థి తెలుగు దేశం పార్టీ ఇప్పుడు ఆ పార్టీ మరియు చంద్రబాబు పై కోపంతో వైసీపీ తీసుకుంటున్న నిర్ణయాలు వల్ల రాష్ట్ర ప్రజలు నష్టపోతారని పవన్ అభిప్రాయం దీనినే ఇప్పుడు వైసీపీ వారు అదిగో చంద్రబాబును ఏమన్నా అంటే దత్తపుత్రుడు తట్టుకోలేకపోతున్నాడు అని ఇష్టమొచ్చినట్టు అంటుంటారు.అయితే ఇప్పుడు అలాంటి వ్యాఖ్యలు చేసే వైసీపీ నేతలకు మరియు జగన్ కు కలిపి అదిరేలా చిన్న సమాధానం పవన్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఇచ్చారు.

చంద్రబాబు మీద కోపంతో జగన్ తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆ ఆలోచనా ధోరణి మార్చుకోవాలని “గతంలో చంద్రబాబు ప్రారంభించిన ఐటీ హబ్ ప్రాజెక్ట్ ను జగన్ తండ్రి స్వర్గీయ వై ఎస్ రాజశేఖర్ రెడ్డి గారు కానీ కొనసాగించి ఉండకపోయినట్టైతే ఈ పాటికి హైదరాబాద్ ఎంత వెనకపడి ఉండేదో ఆలోచించాలి” అని ఓ పాయింట్ కూడా సూచించారు.ఇక దీనిని బట్టి అయినా సరే పవన్ చెప్తున్నా మాటల్లో ఆంతర్యాన్ని అర్ధం చేసుకొని చంద్రబాబు హయాంలో మొదలు పెట్టిన పనులు తన తండ్రిలానే పూర్తి చేస్తారో లేదో చూడాలి.