ఆ ధైర్యం ఒక్క పవన్ కళ్యాణ్ కి మాత్రమే వుంది

Wednesday, September 18th, 2019, 06:50:14 PM IST

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేస్తున్న కార్యక్రమాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. జనసేన సైనికులు సోషల్ మీడియా ద్వారా పవన్ కళ్యాణ్ కి చేస్తున్న ప్రచారం అంతా ఇంతా కాదు. పవన్ యురేనియం తవ్వకాలపైనా, వైసీపీ ప్రభుత్వం పైన చేస్తున్న పోరాటానికి ప్రభుత్వాలు భయపడే పరిస్థితి వచ్చిందని చెప్పాలి.

పవన్ కళ్యాణ్ గడిచిన ఎన్నికలలో అంతగా ప్రభావం చూపలేకపోయారు. కానీ నల్లమల అడవుల విషయం లో పవన్ కళ్యాణ్ ద్వారానే యురేనియం తవ్వకాల పై గవర్నమెంట్ ఒక నిర్ణయాన్ని తీసుకొనే అవసరం వచ్చింది. కాంగ్రెస్ పార్టీ మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ #SaveNallamala అని మొదలు పెట్టగానే ఈ ఉద్యమం తీవ్ర రూపం దాల్చుతుందని కెసిఆర్ అసెంబ్లీ లో ముందుగానే తీర్మానం చేసారు అని చెప్పిన సంగతి అందరికి తెలిసిందే.

ఒక పక్క జనసేన సోషల్ మీడియా కి సంబంధించి 400 ట్విట్టర్ అకౌంట్స్ నిలిపివేసినట్లు తన ట్విట్టర్ అకౌంట్ లో వెల్లడించారు. ఏదేమైనా సమస్యల పై పోరాటం చేస్తే ఇలా చేయడం ఏమిటి అంటూ జనసైనికులు ఆందోళన చెందుతున్నారు. పవన్ రాజకీయంగా నిలదొక్కుకోలేనప్పటికీ పవన్ సమస్యల పై చేసే పోరాట పటిమ ప్రభుత్వాన్ని ముప్పు తిప్పలు పెడుతుంది అంటూ జనసైనికులు అంటున్నారు. ప్రభుత్వం భయపడే ఇలాంటి చర్యలు తీసుకుందని, పవన్ కళ్యాణ్ కి మాత్రమే ప్రభుత్వాన్ని ఎదిరించే దైర్యం ఉందని చెప్పుకోవచ్చారు.