పవన్ చర్యలు నిజంగానే ఊహాతీతం..అప్పుడే రెండు..?

Friday, January 12th, 2018, 09:19:34 AM IST

అజ్ఞాతవాసి చిత్రం నిరాశ పరచడంతో పవన్ కళ్యాణ్ తరువాతి స్టెప్ ఏంటనే దానిపై సినీరాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొని ఉంది. పవన్ కళ్యాణ్ ఇకపై సినిమాలు చేస్తాడా చెయ్యడా అనే సందిగ్దత నెలకొని ఉన్న సమయంలో ఆసక్తికరమైన ప్రచారం ఫిలిం నగర్ లో జరుగుతోంది. అజ్ఞాతవాసి హిట్ అయి ఉంటె పవన్ అభిమానుల్లో ఉత్సాహం నెలకొని జనసేన పార్టీకి ఎంతోకొంత ఉపయోగం ఉండేది. కానీ అలా జరగక పోవడంతో పవన్ ఆలోచనలో పడ్డట్లు తెలుస్తోంది.

2019 ఎన్నికల కు ముందు మరో చిత్రాన్ని విడుదల చేయడానికి ఆసక్తిగా ఉన్నాడట. అందుకోసం ఇదివరకే సంప్రదింపులు జరిగిన రెండు చిత్రాలని పవన్ కళ్యాణ్ ఓకె చేసే పనిలో ఉన్నాడని ఇన్ సైడ్ టాక్. అతి త్వరలోనే దీనిపై ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా జనసేన పార్టీని ఎలా ముందుకు నడిపిస్తాడనేది ఇక్కడ ఆసక్తికరంగా మారింది.