వై యస్ జగన్ ప్రభుత్వానికి పవన్ మరొకసారి విన్నపం!

Tuesday, March 31st, 2020, 10:40:45 PM IST

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా కార్మికులు, రైతులు కూలీలు తమ ఉపాధిని కోల్పోయారు. అయితే ఈ మేరకు వారి సమస్యలను అర్దం చేసుకొని పవన్ కళ్యాణ్ స్పందించారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి సవినయంగా విన్న వించుకున్నారు. కరోనా వ్యాప్తి నేపధ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశం మేరకు లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే.అయితే ఈ లాక్ డౌన్ వలన కార్మికులు, కూలీలు ఉపాధ కోల్పోయారని జన సేన అదినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ లాక్ డౌన్ కారణంగా ఉద్వాన, అక్వ రైతులు సమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు. కార్మికుల, రైతుల సమస్యలని ప్రభుత్వం గుర్తించాలని సూచించారు. అయితే మార్కెట్లు మూతపడి అరటి రైతులు నష్టపోయిన విషయాన్ని వెల్లడించారు. వారి ఉత్పత్తులను ప్రభుత్వమే కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.