బ్రేకింగ్: జగన్ ప్రభుత్వానికి పవన్ విన్నపం ఏమిటంటే?

Thursday, March 26th, 2020, 02:54:06 PM IST

కరోనా వైరస్ కారణంగా తెలుగు రాష్ట్రాల్లో పలు ఇబ్బందులు కూడా తలెత్తుతూనే ఉన్నాయి. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ లోకి వెళ్లిపోయింది. అందులో మన తెలుగు రాష్ట్రాలు అయిన ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ లు కూడా ఉన్నాయి. అయితే ఈ నేపధ్యంలో హైదరాబాద్ లో ఉంటున్న హాస్టల్ విద్యార్థులకు, ఉద్యోగులకు ఇపుడు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. హాస్టల్ యాజమాన్యాలు ఈ పరిస్తితి లలో హాస్టల్ లను నడపలేము అని వారితో చెప్పాయి.

అయితే నిన్న పోలీస్ స్టేషన్ ల వద్ద హాస్టల్ లో ఉండేవారు పెద్ద ఎత్తున చేరారు. Noc కోసం చాలా కష్టపడ్డారు విద్యార్థులు, ఉద్యోగులు. అయితే ఈ నేపధ్యంలో పోలీసులు ఇచ్చిన noc తో బయలు దేరినప్పటికి ఆంధ్ర ప్రదేశ్ సరిహద్దుల్లో వారిని అడ్డుకున్నారు. అయితే ఈ విషయం పై రెండు రాష్ట్రాల అధికారులు ముందే చర్చించు కుంటే ఈ సమస్య వచ్చేది కాదని అన్నారు. అయితే చదువుకుంటున్న వారు, ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న వారు ఉన్నారని, వారి వేదనను ప్రభుత్వం అర్దం చేసుకోవాలని కోరారు. అవసరమైతే హోమ్ క్వారంటైనే ఉండమని సూచించండి. అలా రోడ్డు పై గుంపులు గా వదిలే కొత్త సమస్యలు వస్తాయి అని వ్యాఖ్యానించారు.

అంతేకాకుండా కరోనా వైరస్ మహమ్మారి నీ ఎదుర్కొనేందుకు నిరంతరం కృషి చేస్తున్న వైద్య సిబ్బంది నీ పట్టించుకోవాలని, వారికి అవసరమైన వాటిని అందుబాటులో ఉంచాలని కోరారు. అంతేకాకుండా నిత్యావసర వస్తువుల విషయాల్ని కూడా పవన్ కళ్యాణ్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెల్లడించారు. మరి ఈ విషయాల పై జగన్ ఎలా స్పందిస్తారో చూడాలి.