సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలి – పవన్ కళ్యాణ్

Tuesday, April 20th, 2021, 01:54:10 PM IST

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కి కరోనా వైరస్ సోకిన సంగతి అందరికీ తెలిసిందే. సోమవారం నాడు కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు చేయించుకోగా కేసీఆర్ కి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. అయితే కరోనా వైరస్ సోకడం పట్ల వైద్యుల సలహాలు సూచనల మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ హోమ్ ఐసోలేశన్ లో ఉన్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్న జన సేన పార్టీ అధినేత, ప్రముఖ నటుడు పవన్ కళ్యాణ్ స్పందించారు. అయితే కరోనా వైరస్ భారిన పడిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. సంపూర్ణ ఆరోగ్య వంతులై ఎప్పటి లాగే ప్రజా సేవ లో నిమగ్నం కావాలి అని వ్యాఖ్యానించారు.