బిగ్ న్యూస్: పుకార్లకు పుల్ స్టాప్ పెట్టిన పవన్… అసలేమైంది!

Friday, December 13th, 2019, 03:52:02 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో జనసేన పార్టీ ఫై వస్తున్న పుకార్లను పవన్ కళ్యాణ్ కొట్టి పారేశారు. రైతు సౌభాగ్య దీక్షకు హాజరు కాకపోవడం తో జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కి షోకాజ్ నోటీసులు జారీ చేసారని వస్తున్న వార్తల ఫై పవన్ స్పందించారు. ఈ వ్యాఖ్యలు అవాస్తవం అని తెలిపారు. వైసీపీ వెబ్సైటు లో రావడాన్ని బట్టి కావాలని ఎవరు చేయిస్తున్నారో అర్ధం అవుతుంది అంటూ వైసీపీ ఫై నిందలు వేశారు. అయితే ఇలా అవాస్తవాలు వ్యాపింప జేసేవారు రాపాక వర ప్రసాద్ గారికి క్షమాపణ చెప్పాలని పవన్ అన్నారు.

అయితే ఈ సందర్భంగా ఒక విషయాన్నీ గుర్తు చేసారు పవన్ కళ్యాణ్. రాపాక వరప్రసాద్ గారిని అరెస్ట్ చేసి, బెయిల్ రానివ్వకుండా వైసీపీ ప్రయత్నించినపుడు స్వయంగా తానే రంగంలోకి దిగారన్న విషయం నియోజకవర్గ ప్రజలు గుర్తించుకోవాలని పవన్ తెలిపారు. ఇలాంటి అవాస్తవ ప్రచారాన్ని ఆపాలని, ఇలా చేసినందుకు రాపాక వర ప్రసాద్ కి క్షమాపణ చెప్పాలని పవన్ కోరారు. ఇప్పటికే ఈ న్యూస్ వైరల్ అవుతుండటంతో పవన్ స్పందించాల్సి వచ్చింది.