వైసీపీ ది రంగుల రాజ్యం –జనసేన అధినేత పవన్ కళ్యాణ్

Monday, December 2nd, 2019, 06:54:18 PM IST

రాయలసీమ పర్యటన లో వున్న పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఫై విమర్శలతో విరుచుకుపడుతున్నారు. ఒక సారి మతం మారాక, కులం దేనికి కులం ఒదిలేసేయ్యాలి. కులం కావాలి, మతం కావాలి, అన్ని కావాలి. ఓట్లు కావాలి, డబ్బులు కావాలి అంటూ పవన్ కళ్యాణ్ జగన్ మోహన్ రెడ్డి ని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేసారు. యువత మారింది, సమాజం మారింది, తరాలు మారాయి. కానీ ఈ రంగులే మారట్లే అంటూ వైసీపీ పార్టీ నుద్దేశించి విమర్శలు గుప్పించారు పవన్ కళ్యాణ్.

అంతేకాకుండా రాయలసీమ పర్యటనలో వున్న పవన్ కళ్యాణ్ వైసీపీ ది రంగుల రాజ్యం అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. అభివృద్ధి ఏమో కానీ, ఇటీవల కాలంలో త్రివర్ణ పతాకం రంగుల పైన వైసీపీ రంగులు వేసిన సంగతి అందరికి తెలిసిందే. గాంధీ విగ్రహ దిమ్మెకు వైసీపీ రంగులేసిన విషయం అందరికి తెలిసిందే. తాజాగా ఒక ఆలయం లోని సాయి బాబా విగ్రహం ఫై వైసీపీ రంగులు గల శాలువని కప్పిన విషయం అందరికి తెలిసిందే. చాల చోట్ల వైసీపీ రంగులు కనబడటం, సోషల్ మీడియా లో కూడా అవి తెగ వైరల్ అవుతుండటం తో వైసీపీ ఫై విమర్శలు గుప్పిస్తున్నారు. వాటిని ఉద్దేశించే పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది.