కాపులకు అన్యాయం చేశారు.. జగన్ సర్కార్‌పై పవన్ సీరియస్..!

Saturday, June 27th, 2020, 09:50:29 PM IST

ఏపీలోని కాపులకు జగన్ ప్రభుత్వం అన్యాయం చేసిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. అయితే బ్రిటిష్‌ కాలంలో బీసీలుగా ఉన్న కాపులను, ఓసీలుగా మార్చి, తర్వాత రాజకీయ లబ్ధికి వాడుకున్నారని విమర్శించారు.

అయితే 56 ఏళ్ళుగా కాపులపై కపట ప్రేమను నటిస్తూ ఓట్లు దండుకున్నారని దుయ్యబట్టారు. కాపులు ఆర్థికంగా బలపడటం ఇష్టంలేక రిజర్వేషన్లను అడ్డుకున్నారని అన్నారు. అయితే జగన్ అధికారంలోకి వచ్చాక కూడా కాపులకు అన్యాయమే చేశారని, 5 శాతం రిజర్వేషన్లను తుంగలోకి తొక్కారని అన్నారు. కాపులకు రిజర్వేషన్ హక్కును పునరుద్దరించాలని డిమాండ్ చేశారు.