భవిష్యత్ రాజకీయాలపై పవన్ సంచలన నిర్ణయం.?

Tuesday, June 4th, 2019, 01:55:16 AM IST

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఒక సరికొత్త మార్పులు తీసుకు రావడం ఖాయం అని అంతా అనుకున్నా అది సాధ్య పడలేదు.వారు ముందు నుంచి కోరుకుంటున్న మార్పుకు సంబంధించి రాష్ట్రంలో వారు ఇంకొన్నాళ్ళు బలమైన పోరాటం చేస్తే తప్ప సాధ్యమయ్యేలా లేదని జనసేన శ్రేణులు సహా పవన్ కూడా అనుకుంటున్నారట.అయితే పవన్ మాత్రం ఫలితాలు వచ్చిన తర్వాత నుంచి పెద్దగా బయట ఎక్కడా కనిపించలేదు.

తన పార్టీ ఆఫీసులోనో లేక పార్టీ శ్రేణులతో తప్ప ఇంకెక్కడా బయటకు రాలేదు.దీనితో అనేక రకాల అనుమానాలు అందరిలో కలిగాయి.కానీ వాటన్నిటికీ ఫుల్ స్టాప్ చెప్తూ పవన్ తాను పూర్తి స్థాయి రాజకీయాలు చేస్తానాని చెప్పుకొచ్చారు.ఇప్పుడు దానికి సంబంధించి భవిష్యత్ రాజకీయాలపై కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నట్టు తెలుస్తుంది.పవన్ ఇప్పటి నుంచి జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నారని తెలుస్తుంది.

అలాగే వారు చేసిన పొరపాట్లు తప్పిదాలను సమగ్రంగా తెలుసుకొని రానున్న రోజుల్లో ఏం చేస్తే బాగుంటుందో అన్నది కూడా పవన్ ఆలోచిస్తున్నారట.పార్టీకి బూత్ స్థాయి కమిటీలు వేయాలని అలాగే గ్రామ స్థాయిల్లో ఎక్కడెక్కడ అయితే వీక్ గా ఉన్నారో అక్కడ పార్టీను మరింత బలోపేతం చెయ్యాలని అనుకుంటున్నారట.ముఖ్యంగా గ్రామాల్లోనే వీరి దృష్టి ఉండబోతుంది అని అందుకు తగ్గట్టుగా వారి పార్టీ శ్రేణులు నడుచుకోవాలని పవన్ సూచించినట్టు తెలుస్తుంది.మరి రానున్న రోజుల్లో జనసేన పార్టీ మరింత బలాన్ని పుంజుకుంటుందా లేదా అన్నది చూడాలి.