మాస్ రాజా కోసం పవర్ స్టార్ దిగుతున్నాడు ?

Monday, May 7th, 2018, 10:50:58 PM IST


మాస్ రాజా రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం నెల టికెట్. సోగ్గాడే ఫేమ్ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ నెల 10న పాటల వేడుక జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. హైద్రాబాద్ లోని పీపుల్స్ ప్లాజా లో ఈ వేడుక జరగనున్నట్టు తెలిసింది. ఇక వరుస పరాజయాలతో సతమతమైన రవితేజ కాస్త గ్యాప్ ఇచ్చి చేసిన రాజా ది గ్రేట్ ఓ మోస్తరు హిట్ గా నిలిచింది కానీ ఎన్నో ఆశలు పెట్టుకున్న టచ్ చేసి చూడు మాత్రం భారీ ప్లాప్ అవ్వడంతో రవితేజ ఆశలు నీరుగారిపోయాయి. కనీసం ఈ సరైన మంచి హిట్ కొట్టాలనే ఆలోచనలో భాగంగా పవర్ స్టార్ క్రేజ్ ని వాడుకోవాలని అనుకున్నాడేమో .. ఇప్పటికే రవితేజ, పవన్ ల మధ్య మంచి స్నేహం ఉంది. అందుకే తన పాటల వేడుకకు పవన్ ని పిలిచాడు. పవన్ కూడా ఓకే చెప్పడంతో ఈ నెల 10న ఏర్పాటు చేస్తున్నారు. ఈ మద్యే పవన్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు… ఇక అయన సినిమాలు చేయనని చెప్పడంతో మెగా ఫాన్స్ నిరాశలో పడ్డారు .. వాళ్ళను ఖుషి చేయడానికి ఇలా సినిమా ఫంక్షన్స్ కు వస్తున్నాడు.

  •  
  •  
  •  
  •  

Comments