రేపు రాజధాని గ్రామాలలో పవన్ కళ్యాణ్ పర్యటన..!

Saturday, February 15th, 2020, 01:57:11 AM IST

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రేపు రాజధాని అమరావతి గ్రామాలలో పర్యటించనున్నారు. రేపు ఉదయం తొమ్మిది గంటలకు రాజధానులోని పలు గ్రామాల మీదుగా పవన్ పర్యటన కొనసాగనుంది. అయితే రాజధాని తరలింపుపై దీక్ష చేస్తున్న రైతులకు, మహిళలకు పవన్ మద్దతు తెలపనున్నారు. జనసేన పార్టీ ఆపీసు నుంచి బయలుదేరనున్న జనసేనాని.. యర్రబాలెం, పెనుమక, రాయపూడి, తుళ్లూరు, అనంతవరం వెంకటేశ్వరస్వామి ఆలయం వరకు పర్యటిస్తారు.