బిగ్ బ్రేకింగ్: నవంబర్ 3 న విశాఖలో భారీ ర్యాలీ చేపట్టనున్న పవన్ కళ్యాణ్… ఎందుకో తెలుసా?

Sunday, October 20th, 2019, 03:20:35 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో ఇసుక కొరత వలన ప్రజలు, కార్మికులు చాల ఇబ్బంది పడుతున్నారు. నిర్మాణ రంగం పై ఆధారపడి జీవించే వారి పరిస్థితి ఇంకా దారుణమని చెప్పాలి. ఉపాధి లభించక కార్మికులు చాల ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వారికీ మద్దతుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ పట్నం లో భారీ ర్యాలీ చేయాలనీ నిర్ణయించుకున్నారు. అయితే దీనికి సంబందించిన పూర్తీ వివరాలను ఇంకా గోప్యంగా ఉంచింది. నవంబర్ 3 న మధ్యాహ్నం 3 గంటలకు ర్యాలీని చేపట్టనున్నారు.

అయితే ప్రజలకోసం, కార్మికుల కోసం పవన్ చేస్తున్న ఈ పని హర్షించదగినది. కానీ ఈ ర్యాలీ ని ఎక్కడనుండి ఎక్కడ వరకు జరపాలి అని స్థానిక నాయకులను సంప్రదించి ఖరారు చేస్తారని అర్ధం అవుతుంది. ఇసుక కొరత పై వైసీపీ ప్రభుత్వం పై పలు విమర్శలు చేసిన పవన్ కళ్యాణ్, ప్రభుత్వ స్పందన లేమితో ఈ చర్యలు తీసుకుంటున్నారా? లేదా అనేది తెలియాల్సి వుంది. ఇంకా సమయం ఉండటం తో జగన్ ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. పవన్ చేస్తున్న ఈ భారీ ర్యాలీ తో అధికార పార్టీ ని ఇబ్బందుల్లోకి నెట్టే ప్రయత్నం జరగనుందని తెలుస్తుంది.